ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి - Karimnagar crime news

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి
ఆర్టీసీ బస్, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి
author img

By

Published : Nov 4, 2020, 4:56 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిర్సపల్లి నుంచి జమ్మికుంట వైపు ధాన్యం బస్తాల లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్​ను హుజూరాబాద్​ ఆర్టీసీ డిపోకి చెందిన బస్​ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సిర్సపల్లికి చెందిన బొల్లి మొగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ సుధాకర్‌రెడ్డి, కండక్టర్‌ వీరన్నలతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, డిపో మేనేజర్‌ రాజ్యలక్ష్మి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్​లో సుమారు 30 మందికి పైగా ఉన్నట్లు వెల్లడించారు. మృతుని బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.