రాఖీ పండుగ సందర్భంగా తన అన్నకు రాఖీ కడదామని బయల్దేరిన స్వప్నను రోడ్డు ప్రమాదం రూపంలో మృతువు వెంటాడింది. కరీంనగర్ జిల్లా నర్సింహులపల్లి నుంచి తన భర్త హరికృష్ణతో కలిసి బైక్‌పై బయలుదేరింది. పెద్దపల్లి వరకు వచ్చిన స్వప్నను తన సోదరుడు రాజేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు బయలుదేరాడు.
అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కార్యాలయం మూలమలుపు వద్దకు రాగానే పక్కనే వచ్చిన లారీ.. వారి బైక్‌ను ఢీ కొట్టింది. దీనితో స్వప్న అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాల పాలైన రాజేంద్రను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల