ETV Bharat / jagte-raho

చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​ పరిధిలో వోల్వో కారు బంజారాహిల్స్​ నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరప అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి గాయాలయ్యాయి.

Car accident at Gatchibauli police station
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
author img

By

Published : Nov 9, 2020, 4:01 PM IST

Updated : Nov 9, 2020, 4:43 PM IST

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సార్​ నగర్​ మధురనగర్​కు చెందిన ప్రియాంక ((20) ఎంబీబీఎస్ విద్యార్థిని, రష్యా), మిత్తి మోడీ ((20) గీతం యూనివర్సిటీ, వైజాగ్​,) జూబ్లీహిల్స్ పబ్​ నుంచి లాంగ్​ డ్రైవ్​లో భాగంగా లింగంపల్లి వైపు వెళ్తుండగా.. గచ్చిబౌలి హెచ్​సీయూ గేట్​ నంబరు 2 సమీపంలో కారు అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టింది.

ప్రియాంక కారు బెల్డు పెట్టకపోవడం వల్ల అక్కడిక్కడే మృతి చెందింది. కారు డ్రైవ్​ చేస్తున్న మిత్తి మోడీ ప్రాణపాయం నుంచి బయట పడ్డాడు. ప్రియాంక, మిత్తి మోడీ మద్యం సేవించారని.. మిత్తి మోడీని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతి చెందిన ప్రియాంక(20) మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 9, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.