హైదరాబాద్, ముంబయి 65వ నంబర్ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటకలోని బీదర్ జిల్లా చిడిగుప్పా తాలూకా చంగ్లేర్కు చెందిన చాంద్ పాషా(46) అతని ఆరేళ్ల కుమారుడు ఫైజన్ అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మృతుడు చాంద్ పాషా భార్య అజీజా బేగం, మరో కుమారుడు ఇబ్రహీం తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై చిరాగ్ పల్లి ఏఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రిలో శవ పరీక్షల అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.
ఇదీ చూడండి: తెలుగు యువ ఐఏఎస్ అధికారికి అరుదైన అవకాశం