మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లో చెట్ల పొదల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి టవేరా వాహనం, రూ.15వేలు, రెండు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలతో దాడులు జరిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలను అరికట్టడానికి ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'బుల్లెట్ సైలెన్సర్ మార్చారో.. మీ బైక్ స్టేషన్‌కే'