ETV Bharat / jagte-raho

ఉద్రిక్తతకు దారితీసిన భూవివాదం.. ఈదుల నాగులపల్లిలో ఘర్షణ - గౌతమి నగర్ ప్లాట్ల యజమానులపై దాడి

సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గౌతమి నగర్ ప్లాట్ల యజమానులపై ప్రగతి గ్రూప్ సంస్థల సిబ్బంది దాడికి పాల్పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరువర్గాల మధ్య భూవివాదం నడుస్తోంది.

attack on  gowthami nagar plot holders
ఉద్రిక్తతకు దారితీసిన భూవివాదం
author img

By

Published : Oct 9, 2020, 5:49 AM IST

సంగారెడ్డి జిల్లాలో ఓ భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామ పరిధిలోని గౌతమి నగర్ ప్లాట్ల యజమానులపై.. ప్రగతి గ్రూప్ సంస్థల సిబ్బంది దాడి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరువర్గాల మధ్య భూ వివాదం నెలకొంది.

గురువారం సాయంత్రం తమ ప్లాట్ల వద్దకు వెళ్లగా ప్రగతి గ్రూప్ సిబ్బంది అడ్డుకుని దుర్భాషలాడి తీవ్రంగా గాయపరిచారని గౌతమినగర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. వృద్ధులు, మహిళలు అని చూడకుండా బౌన్సర్లతో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గౌతమి నగర్ అసోసియేషన్ సభ్యులు బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసినట్లు సీఐ రామిరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: యాదాద్రిలో దంపతులపై కత్తితో దాడి... భూవివాదాలే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.