కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ మంజీరా నది నుంచి కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఇసుక దందాకు పూర్తి సహకారం అందిస్తున్నారని ఇసుక దందా చేసే రాములు ఆరోపించాడు.
పోలీసుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని రాములు తెలిపాడు. తన వద్ద డబ్బులు తీసుకున్న సిబ్బంది పేర్లను బహిర్గతం చేశాడు. రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది.. డబ్బులు, మందు, విందు ఇవ్వాలని చరవాణిలో మాట్లాడిన సంభాషణలను వైరల్ చేశాడు. ఇసుక దందాలో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కానిస్టేబుళ్ల మాటలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఈ విషయంలో ఓ కానిస్టేబుల్ను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.