జైపూర్ కేంద్రంగా హైదరాబాద్‌లో క్రికెట్‌బెట్టింగ్ కొనసాగుతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన రాజస్థాన్ పోలీసులు జైపూర్‌లోని ప్రధాన బుక్కీని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా హైదరాబాద్ గచ్చిబౌలిలోని మరికొందరి బుక్కీల వివరాలు తెలుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో బెట్టింగ్ స్థావరంపై దాడులు నిర్వహించిన రాజస్థాన్ పోలీసుల ఏడుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్ కేంద్రంగా కమిషన్ ద్వారా హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబయి, దిల్లీలో మరికొంతమంది బుక్కీలను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ ద్వారా పుంటర్ల నుంచి నగదు బదిలీలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని 65వేల నగదు, 4ల్యాప్ టాప్‌లు, 46 చరవాణులు, 6ల్యాండ్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'చాక్ పీస్‌లు తినొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకుంది'