వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి కొండల్లో కొంత మంది గుంపుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటేసే ప్రయత్నం చేయగా... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో ప్రత్నించగా... అసలు విషయం తెలిపారు.
అసలు విషయం ఏమిటంటే...
వికారాబాద్‌కు చెందిన పాత ఇనుప సామానుల వ్యాపారం చెసే పరుశరాం వాట్స్ యాప్ గ్రూపుల్లో తన వద్ద నాగస్వారం కాయ ఉందనే పోస్టింగులు పెట్టాడు. దాన్ని చేజిక్కించుకుంటే లక్షల రుపాయలు వస్తాయని నమ్మించాడు. ఈ వార్తలు నమ్మిన హైదరాబాద్, నల్గొండ, పరిగి, తాండూరు, వికారాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు పరుశరాంను కలిశారు. ఆ సమయంలోనే పోలీసుల కంటపడ్డారు.
చివరికి కటకటాల పాలైయ్యారు. పెంట కుప్పల పైన దొరికే సోరకాయలను రెండింటిని ఒకటిగా చేసి ఇది నాగస్వారం కాయ అని ప్రచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.