హైదరాబాద్ రాంనగర్‌లోని స్పైసీ ఫుడ్ కోర్టు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై దాడి కేసులో నలుగురిని చిక్కడిపల్లి పోలీసులు గుర్తించారు. గత నెల 28న కొందరు వ్యక్తులు, యువకులు ఫుడ్ కోసం వచ్చి మెను విషయంలో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ దృష్టిలో పెట్టుకుని.. తన అనుచరులతో కలిసి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై దాడితో పాటు యజమానిపైనా దాడికి పాల్పడ్డారు.
ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విచారణ చేపట్టిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ ద్వారా దాడి చేసిన సుమన్, శ్రీకాంత్, మహేందర్, జయకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండిః ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి