ETV Bharat / jagte-raho

అఖిలప్రియ ఫోన్లు ఎక్కడున్నాయి? వాటినెలా స్వాధీనం చేసుకోవాలి? - అఖిలప్రియ వార్తలు

ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటిని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

akhila priya
akhila priya
author img

By

Published : Jan 15, 2021, 3:38 PM IST

ప్రవీణ్ రావు సోదురుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.... అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలిక చరవాణి ఉపయోగించినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్​పల్లిలోని లోధ అపార్ట్​మెంట్ వరకు అఖిలప్రియ రెండు చరవాణిల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు.

ఫోన్​ను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు

అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె ఉపయోగించిన రెండు చరవాణిలు ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లుకు తాళం వేసి ఉంది. న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంటి తాళం తీసి... చరవాణిలు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల అదుపులో 12 మంది

అపహరణ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్​ను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు. అపహరణ కుట్ర గురించి వీళ్లకు ముందే తెలుసని... వీళ్ల సమక్షంలో కిడ్నాపర్లతో చర్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న భార్గవరామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో 12మంది కిడ్నాపర్లు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు నిందితుల గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.