కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో 15 ఏళ్ల వికలాంగ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నీరడి నవీన్... శనివారం రోజన తాత వెంకట్‌తో కలిసి మేకలు మేపడానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల తల్లి లక్ష్మీ... ఊరంతా గాలించింది. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. నేడు గ్రామ శివారులోని ఎడ్ల కట్ట వాగు నీటి కుంటలో నవీన్ మృతదేహం కనిపించింది. మూడు రోజులుగా... తాతతో కలిసి మేకలు మేపడానికి వెళ్తున్నాడు. నవీన్ వికాలాంగుడు కావడం వల్ల ఏమీ ఉపయోగం లేదని వెంకట్ ఎప్పుడూ తిడుతుండేవాడని.. నవీన్‌ను చంపి తాను చస్తానని పలు మార్లు అన్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తాత వెంకటే నవీన్‌ను చంపి ఉంటాడని తల్లి లక్ష్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వికలాంగ బాలుడి మృతదేహం - kamareddy latest news
మూడు రోజులుగా తాతతో మేకలు మేపడానికి వెళ్లిన నవీన్ శనివారం తిరిగి ఇంటికి చేరలేదు. ఎంతసేపటికి రాకపోవటం వల్ల ఆందోళన చెందిన తల్లి.... తెలిసిన చోట్లన్ని వెతికింది. ఎక్కడా కన్పించలేదు. ఈరోజు ఓ నీటి కుంటలో శవమై తేలాడు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో 15 ఏళ్ల వికలాంగ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నీరడి నవీన్... శనివారం రోజన తాత వెంకట్‌తో కలిసి మేకలు మేపడానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల తల్లి లక్ష్మీ... ఊరంతా గాలించింది. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. నేడు గ్రామ శివారులోని ఎడ్ల కట్ట వాగు నీటి కుంటలో నవీన్ మృతదేహం కనిపించింది. మూడు రోజులుగా... తాతతో కలిసి మేకలు మేపడానికి వెళ్తున్నాడు. నవీన్ వికాలాంగుడు కావడం వల్ల ఏమీ ఉపయోగం లేదని వెంకట్ ఎప్పుడూ తిడుతుండేవాడని.. నవీన్‌ను చంపి తాను చస్తానని పలు మార్లు అన్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తాత వెంకటే నవీన్‌ను చంపి ఉంటాడని తల్లి లక్ష్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దారుణ ఘటన.. గొంతుకోసి భర్తను చంపిన భార్య...