ETV Bharat / jagte-raho

బీ అలర్ట్​: కస్టమర్​ కేర్​ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు - paytm frauds

గూగుల్​పే కస్టమర్​ కేర్​ నుంచి మాట్లాడుతున్నామని ఒకరు... కేవైసీ అప్​డేట్​ చేసుకోవాలని ఇంకొకరు... బ్యాంకు నుంచి రుణమిస్తామని మరొకరు... 'ఏ రాయి అయితే ఏంటీ పళ్లు రాలగొట్టుకోవడానికి' అన్నట్లు వచ్చిన ప్రతీ ఫోన్​ ద్వారా ఎవరో ఒకరు లక్షలు పోగొట్టుకున్నవారే. ప్రజల అమాయకత్వాన్నే పెట్టుబడిగా పెట్టి లక్షలు దోచేస్తున్న సైబర్​ నేరగాళ్లు... నగరంలో రెచ్చిపోతున్నారు.

బీ అలర్ట్​: కస్టమర్​ కేర్​ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు

author img

By

Published : Sep 20, 2020, 9:12 PM IST

ఆన్​లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సైబర్​ మోసగాళ్ల గేలానికి చిక్కి అమాయకులు లక్షలు పొగొట్టుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 30 నుంచి 50 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు.

కస్టమర్​ కేర్​ అంటూ...

సికింద్రాబాద్ బాలంరాయ్​కి చెందిన నాగమల్లేశ్ తన ఫోన్​లో గూగుల్ పే ద్వారా తెలిసిన వారికి డబ్బు పంపించాడు. ఆ డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. దాంతో కస్టమర్ కేర్ కోసం అంతర్జాలంలో వెతికి... ఓ నెంబరుకు ఫోన్ చేస్తే... స్పందించలేదు. తర్వాత ఆ వ్యక్తే మల్లేశ్​కి ఫోన్​ చేయగా... సమస్యను వివరించాడు. వెంటనే క్విక్ సపోర్ట్ యాప్​ను డౌన్​లోడ్ చేయించి... బాధితుని ఖాతాలోంచి ఏకంగా రూ.2లక్షల 20 వేలు కొట్టేశాడు.

సికింద్రాబాద్​కు చెందిన సాలోమన్​రాజు.. తన గూగుల్​పే సరిగా పనిచేయకపోవటం వల్ల కస్టమర్​కేర్​కు ఫోన్ చేశాడు. మొదట్లో ఎవరూ స్పందించలేదు. తర్వాత కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అన్ని వివరాలు తెలుసుకుని రూ.86 వేలు దోచేశారు.

రుణమిస్తామని నమ్మించి...

సికింద్రాబాద్​కు చెందిన శివరాజుకు రుణం ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలు తెలుసుకొని లక్షన్నర వరకు ఇచ్చే వెసులుబాటు ఉందని శివరాజును నమ్మించాడు. ముందుగా జీఎస్టీ కట్టాలని రూ. 24వేలు, ఎన్​వోసీ కోసమని రూ.45 వేలు ఇలా మొత్తం లక్షన్నర తన ఖాతాలో వేయించుకున్నాడు. మళ్లీ ఆ నెంబర్​కి బాధితుడు ఫోన్ చేస్తే స్పందన లేకపోయేసరికి... మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

కేవైసీ అప్​డేట్​ అంటూ...

పద్మారావునగర్​కు చెందిన దిలీప్ కుమార్​కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... పేటీఎం, కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని సూచించాడు. అందుకు దిలీప్​ సంసిద్ధత వ్యక్తం చేయగా... ఎనీడెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేయించాడు. కొద్దిసేపట్లోనే ఖాతాలోంచి రూ.94 వేలు మాయమవగా... బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఖాతా అప్​డేట్​ అంటూ...

బోయినపల్లికి చెందిన రమణకు బ్యాంక్ అధికారి అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఖాతాను అప్​డేట్ చేసుకోవాలని సూచించి... పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటిలో ఖాతాలోంచి రూ.1.25 లక్షలు డ్రా అయినట్లు మేసేజ్ రావడంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్టు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.