ETV Bharat / jagte-raho

భూ వివాదం : రాళ్ల దాడిలో యువకుడు మృతి - telangana news

సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో తండ్రి కొడుకులపై రాళ్ల దాడి చేసిన ఘటనలో కొడుకు మృతి చెందగా... తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

భూవివాదం:తండ్రి కొడుకులపై రాళ్ల దాడి... కొడుకు మృతి

author img

By

Published : Jan 5, 2021, 10:55 PM IST

భూవివాదం నేపథ్యంలో తండ్రి కొడుకులపై చేసిన రాళ్ల దాడిలో కొడుకు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్, పుల్కల్ ఎస్సై నాగమణి కథనం ప్రకారం... చౌట్కూర్​కు చెందిన బేగరి దేవయ్య, ప్రదీప్​లకు చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఇందులో నాలుగు ఎకరాల భూమికి సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిందంటే.. కాదు దానిని నేను కొన్నాను అంటూ దేవయ్య తన ఆధీనంలో ఉంచుకుని సాగుచేస్తున్నారు. ఈ భూమి విషయమై ఇరువర్గాల వారు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారు ఆ భూమి విషయాన్ని ఎటూ తేల్చలేక పార్ట్​(బీ)లో పెట్టారు. ఆ భూమి దేవయ్య ఆధీనంలో ఉండడం వల్ల మంగళవారం అతడు తన కొడుకు కరుణాకర్​తో కలిసి దున్నుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ప్రదీప్ తన సోదరులైన కన్నాగారి కరుణాకర్, ప్రసాద్​లతోపాటు స్నేహితులైన సైదులు, మరో ఇద్దరు మహిళలతో కలిసి అక్కడికి వెళ్లారు.

దేవయ్యతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రం కావడం వల్ల ప్రదీప్ వర్గం వారు తండ్రి కొడుకులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో దేవయ్య, కరుణాకర్​ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందగా.. దేవయ్య ప్రాణాపాయ స్థితిలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమణి తెలిపారు.

ఇదీ చదవండి: అనుమానాస్పదం: ఉరి తాడుకు 11 ఏళ్ల బాలుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.