ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి - karimnagar road accident

తరచూ ప్రమాదాలతో భీతిల్లిన రహదారులు నెలన్నర రోజులుగా కొనసాగుతున్న లాక్​డౌన్​తో ఊపిరి పీల్చుకున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించగా.. వాహనాల రాకపోకలు మొదలై ప్రమాదాలు జరుగుతున్నాయి.

one died in accident in karimnagar district as bike hit lorry
కరీంనగర్​ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : May 15, 2020, 9:28 AM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామానికి చెందిన గడమల్ల ప్రభాకర్.. సదాశివపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు,

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభాకర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి కూరగాయలు తీసుకువచ్చే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.