సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో సంద బుచ్చమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందారు. సంద బుచ్చమ్మ, వెంకటయ్య దంపతులకు సంతానం లేకపోవడంతో శ్రీనివాస్, వినోదలను పెంచుకున్నారు. వీరికి కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయని... వినోద పేరు మీద ఉన్న ఆస్తిని మనవడు నీరుడు వినయ్ తన పేరు మీదకు మార్చుకోవడంతో వివాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో బుచ్చమ్మకు జ్వరం వచ్చిందని... శనివారం అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో పలు అనుమానాలకు దారి తీస్తోందని పోలీసులు తెలిపారు.
బుచ్చమ్మ కుమారుడు శ్రీనివాస్, మనువడు నీరుడు వినయ్ ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం తుంగతుర్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కామారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం... ఇల్లు దగ్ధం