హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి వీసాపై హైదరాబాద్‌లో చదువుతున్న డానియల్.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు.
నిందితుడు లంగర్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. 6 గ్రాముల కొకైన్, నగదు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్.. డానియల్‌ను విచారణ కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. కొద్దిరోజులుగా నగరంలో డ్రగ్స్ సరఫరా తగ్గినా.. ఇటీవల కాలంలో మళ్లీ పెరిగాయి.
ఇదీ చదవండి: డ్రగ్స్ తాయారీకి హైదరాబాద్ కేంద్రమైంది.. అందుకే!