ETV Bharat / jagte-raho

సైబర్​ మోసం.. సరికొత్త కోణం

ఫోన్​ చేసి.. మెయిల్​ పంపి మోసాలకు పాల్పడిన సైబర్​ నేరగాళ్లు.. ఈసారి ట్రెండ్​ మార్చారు.. నగదు గెలుచుకున్నారంటూ ఏకంగా ఇంటికే స్పీడ్​ పోస్ట్​ చేశారు. అప్రమత్తమైన చింతగూడెకు చెందిన బత్తుల నగేశ్​ పోలీసులను ఆశ్రయించారు.

cyber crimes
సైబర్​ మోసం.. సరికొత్త కోణం
author img

By

Published : Dec 15, 2020, 10:19 PM IST

సైబర్​ మోసం.. సరికొత్త కోణం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో సైబర్​ నేరాల్లో మరో కోణం వెలుగులోకి వచ్చింది. చింతగూడకు చెందిన బత్తుల నగేశ్​ కుమార్తె పేరుతో మూడో రోజుల క్రితం స్పీడ్​ పోస్ట్​ వచ్చింది.

అందులో ఏముంది..

అందులో పన్నెండు లక్షలు గెలిచినట్లుగా ఓ కంపెనీ పేరుతో వివరాలున్నాయి. పూర్తి వివరాలు ఓ వాట్సప్​ నంబర్​కు పంపాలని సూచించారు. ఫోస్ట్​లో చెప్పిన విధంగా బ్యాంకు ఖాతా సంఖ్యతో సహా వారు చెప్పిన నంబర్​కు వాట్సప్​ చేశారు బత్తుల నగేశ్​. అనంతరం సోమవారం... దినేశ్​ అనే పేరుతో వారికో ఫోన్​ వచ్చింది.

మీరు గెలుచుకున్న నగదు పొందాలంటే.. పన్నెండు వేల రూపాయలను తాము చెప్పిన బ్యాంకు ఖాతాలో జమచేయాలన్నారు. అనుమానం వచ్చిన బత్తుల నగేశ్​.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్​ నేరగాళ్లు ఇచ్చిన బ్యాంకు ఖాతా తనిఖీ చేశామని.. వివరాలు నకిలీ అని తేలినట్లు ఎస్​ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీచూడండి: ఇంజినీరింగ్ ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.