ETV Bharat / jagte-raho

గ్యాంగ్​స్టర్​ నయీమ్​ అనుచరుడు నాజర్​ అరెస్టు - bhuvanagiri police

భువనగిరిలో గ్యాంగ్​స్టర్​ నయీమ్​ అనుచరుడు నాజర్​ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ భూమి ఆక్రమణకు సంబంధించి 2017 లో కేసు నమోదైనట్లు తెలిపారు. నయీమ్ అనుచరుడిగా కొనసాగుతూ భూ ఆక్రమణలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.

nayeem-follower-nazar-arrested-in-bhuvanagiri

author img

By

Published : Aug 5, 2020, 10:25 AM IST

గ్యాంగ్​స్టర్ నయీమ్ అనుచరుడు నాజర్​ను భువనగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కి తరలించారు. పట్టణంలోని కిసాన్ నగర్​కు చెందిన నాజర్... నయీమ్ అనుచరుడిగా కొనసాగుతూ దందాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ భూమి ఆక్రమణకు సంబంధించి 2017 లో కేసు నమోదైనట్లు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న నాజర్​ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించినట్టు భువనగిరి సీఐ వెల్లడించారు. నయీమ్ కేసులకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాజర్​ను... నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం విచారణ నిమిత్తం గతంలో ఓ సారి అరెస్టు చేసింది.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.