ETV Bharat / jagte-raho

నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు అనిశా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆర్డీవో అరుణ, వసీం, జీవన్ గౌడ్​కు బెయిల్ మంజూరయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ సత్తార్​కు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.

narsapur brib 4 accused's  got a bail
నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
author img

By

Published : Oct 27, 2020, 7:36 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు అనిశా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆర్డీవో అరుణ, వసీం, జీవన్ గౌడ్​కు బెయిల్ మంజూరయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ సత్తార్​కు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది. వీరితో కలిపి ఈ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ వచ్చింది.

అదనపు కలెక్టర్ నగేశ్​ మినహా అందరికి బెయిల్ లభించింది. నగేశ్​పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అనిశా అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్​వోసీ ఇవ్వడానికి అదనపు కలెక్టరు నగేశ్​తో పాటు, ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్ గౌడ్ లంచం తీసుకున్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చదవండి: బండి సంజయ్​కు వైద్య పరీక్షలు.. క్షీణిస్తున్న ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.