ఐదు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముస్తఫా కాలనీలో సయ్యద్ మొయిన్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాపూర్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న ఫర్హాన్ వద్ద మొయిన్ పనిచేసేవాడు. అయితే ఫర్హాన్‌కు ఫర్వేజ్‌తో వ్యాపార లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా ఫర్హాన్‌ను చంపేయాలనుకున్న ఫర్వేజ్.. తన స్నేహితునితో కలిసి పథకం ఆలోచించుకున్నారు.
ఐదురోజుల క్రితం ఫర్హాన్ ద్విచక్రవాహంపై మొయిన్ వెళ్తుండగా.. అతనే ఫర్హాన్ అనుకుని మెయిన్‌ను కత్తులతో పొడిచి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి ఫర్వేజ్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ఇదీ చదవండిః కత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య