ETV Bharat / jagte-raho

తల్లీకుమార్తెలతో సహా మనవరాలు అదృశ్యం.. - Telangana news 2020

తల్లీకుమార్తెలతో సహా మనవరాలు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

missing in kamareddy
తల్లీకుమార్తెలతో సహా మనవరాలు అదృశ్యం..
author img

By

Published : Dec 24, 2020, 7:33 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీనగర్​ కాలనీకి చెందిన రాచర్ల గోపి.. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్​కు చెందిన రాధికను 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి 8 సంవత్సరాల కుమార్తె ఉంది. గోపి స్థానికంగా ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్​లో పని చేస్తుండగా.. రాధిక బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ప్రతినెల పింఛన్ కోసం కామారెడ్డికి వచ్చే రాధిక తల్లి.. ఈనెల 20న కుమార్తె రాధిక ఇంటికి వచ్చింది. నాలుగు రోజులపాటు అల్లుడు గోపి ఇంట్లోనే ఉంది. డిసెంబర్ 24న గోపి రోజు మాదిరి విధులకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేలోగా ఇంట్లో తన భార్య, కూతురు, అత్త కనిపించలేదు. వారి కోసం చుట్టుపక్కలంతా గాలించినా ప్రయోజనం లేదు. ఇంట్లో కొన్ని సామాన్లు కూడా కనిపించకపోవడం వల్ల బంధువుల ఇళ్లలో కూడా వెతికాడు.

ఎంతకీ వారి ఆచూకీ తెలియకపోవడం వల్ల కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. శంకర్ అనే వ్యక్తిపై అనుమానాలున్నట్లు గోపీ తెలపగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.