ETV Bharat / jagte-raho

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య - ts latest news

ఏపీలోని గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలంలో.. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నాడని మైనర్ బలవన్మరణానికి పాల్పడింది. పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో.. భానుప్రసాద్ అనే యువకుడు బాలికను వెేధించేవాడు. కొన్నిరోజులుగా వేధింపులు అధికమవ్వటంతో.. తట్టుకోలేక గడ్డి మందు తాగి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆనందరావు తెలిపారు.

Minor forced death with harassment of a young man in the name of love at guntur district
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య
author img

By

Published : Dec 20, 2020, 7:12 AM IST

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య

ప్రేమ వేధింపులు తట్టుకోలేక మైనర్ విద్యార్థిని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన.. ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో జరిగింది. మండలానికి చెందిన మారిశెట్టి మాధవరావు దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో గ్రామానికి చెందిన భాను ప్రసాద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో.. తట్టుకోలేక ఈనెల 13వ తేదీ ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు.. చికిత్స నిమిత్తం తొలుత సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

గ్రామానికి చెందిన భాను ప్రసాద్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగాను. నా మృతికి కారణమైన యువకుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. -బాధితురాలు

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శ

మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆనందరావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరు ఆసుపత్రికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి.. ఆర్ధిక సాయం అందించారు.

ఇదీ చదవండి: కానిస్టేబుల్‌తో మహిళా ఎస్సై సాన్నిహిత్యం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.