ETV Bharat / jagte-raho

కోటికిపైగా లంచం.. అనిశా ఆఫీసులో నిందితులు

ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్​ను అనిశా అధికారులు బంజారాహిల్స్​లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనిశా న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.

medak district Additional Collector Nagesh including accused persons will be attend the acb court hyderabad
కోటీకిపైగా లంచం.. కోర్టులో హాజరుకానున్న నిందితులు
author img

By

Published : Sep 10, 2020, 3:58 PM IST

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్​ను అనిశా అధికారులు బంజారాహిల్స్​లోని అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. మాచవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయం, ఇంట్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలను తీసుకున్నారు. కొంపల్లిలో నగేష్ నివాసంలో లాకర్​ తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ అహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్​లను అరెస్ట్ చేసి నర్సాపూర్ నుంచి అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు.

ఎకరాకు లక్ష చొప్పున

112 ఎకరాల విస్తీర్ణంలో భూమికి ఎన్ఓసీ ఇవ్వడం కోసం అదనపు కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ 12 లక్షలు ఇవ్వాలని కోరాడు. మొదటి విడతలో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలను బాధితుడు లింగమూర్తి నుంచి నగేష్ తీసుకున్నాడు. మిగిలిన 72 లక్షల కోసం 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్​ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు జామీనుగా బాధితుని నుంచి 8 ఖాళీ చెక్కులను నగేష్ తీసుకున్నాడు.

ఐదుగురు నిందితులకు

జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్​ ఫిర్యాదు దారు నుంచి 5 లక్షలు వసూలు చేశాడు. ఆర్డీఓ అరుణా రెడ్డికి, తహసీల్దార్ సత్తార్​కు చెరో లక్ష ఇచ్చి మిగతా మూడు లక్షలను వసీం తన వద్దే ఉంచుకున్నాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అరకిలో బంగారం అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనిశా న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.

ఇదీ చూడండి : మెదక్ అదనపు కలెక్టర్ సహా నలుగురు అరెస్ట్.. కొనసాగుతున్న సోదాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.