రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామశివారులోని పొలంలో వివాహిత హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన మమతను శంషాబాద్ మండలం దొడ్డు సుల్తాన్పల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చి మమత తల్లిదండ్రులు వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అది అలా ఉండగా నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మమత.. హత్యకు గురై సోమవారం మృతి చెంది కనిపించింది. రైతులు చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.