ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక, కొండాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని విచారించగా.. అతను మావోయిస్టు మిలీషియన్ దళ సభ్యునిగా పోలీసులు గుర్తించారు. లక్ష్మయ్య నుంచి కార్డెక్స్ వైర్, రెండు జిలిటెన్ స్టిక్స్, రెండు టిపిన్ బాక్సులు, రెండు డిటోనేటర్లు, ఒక తూటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 10న ఆలుబాకలో భీమేశ్వరరావును చంపిన ఘటనలో లక్ష్మయ్య నిందితుడని ఏటూరునాగారం ఏఎస్పీ తెలిపారు. పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు అందిస్తున్నందున అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:రూ.కోటీ 25లక్షల విలువైన గుట్కా పట్టివేత