మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్కి చెందిన జయరామ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జయరామ్ భార్య చనిపోయింది. కొంతకాలానికి జయరామ్ మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 17 సంవత్సరాల కూతురు ఉంది. భర్త లేకపోవడం.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె జయరామ్‌తో పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే జయరామ్ ఆమె కూతురిపై కన్నేశాడు. అయితే.. భర్త తన కూతురిపై కన్నేశాడన్న విషయం ఆమె మొదట్లో గమనించలేదు.
జయరామ్ ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. విషయం అర్థం చేసుకున్న ఆ అమ్మాయి తల్లికి చెప్పింది. ముందే జాగ్రత్త పడ్డ సదరు మహిళ కూతురిని బంధువుల ఇంటికి పంపింది. కళ్లెదుట ఆ అమ్మాయి లేకపోవడం భరించలేని జయరామ్ ఆమెను ఇంటికి తీసుకురావాలని.. భార్యను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. తట్టుకోలేకక. ఆమె నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నేరెడ్మెట్ పోలీసులు జయరామ్‌ను అదుపులోకి తీసుకొని.. రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: 'తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా దీటుగా సమాధానాలు'