హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని శివారెడ్డి స్వీట్ షాపులో దారుణ హత్య జరిగింది. వర్కర్ శ్రీనివాస్‌ను మరో వర్కర్ గౌస్ హత్య చేశాడు. తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడిక్కడే శ్రీనివాస్ మృతి చెందాడు.
ఓ మహిళ విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య గొడవ తలెత్తింది. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.