ETV Bharat / jagte-raho

భూ వివాదంలో భార్యాభర్తలపై కత్తితో దాడి - భార్యభర్తలపై కిరాతకంగా దాడి

man attack on couple in land disputes at buddaram
భూ వివాదంలో భార్యాభర్తలపై కత్తితో దాడి
author img

By

Published : Jul 8, 2020, 9:47 AM IST

Updated : Jul 8, 2020, 1:04 PM IST

09:45 July 08

భూ వివాదంలో భార్యాభర్తలపై కత్తితో దాడి

భూ వివాదంలో భార్యాభర్తలపై కత్తితో దాడి

భూ తగాదాలతో దంపతులపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అర్జున్​రావు... అనంతరావు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో కొంత భూమి ఇతరులకు విక్రయించాడు. ఈ క్రమంలో అర్జున్​రావుకు తెలియకుండా అనంతరావు 28 గుంటల భూమి కొనుగోలుదారుడికి ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది.  

తాను పొరపాటు చేశానని, అవసరమైతే తానే స్వయంగా భూమి ఇస్తానని అనంతరావు ఒప్పందపత్రం రాసిచ్చాడు. ఈ రోజు ఉదయం అనంతరావు దంపతులతో గొడవ పడిన అర్జున్​రావు... ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరావు భార్య రత్నమ్మను తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హైదరాబాద్​కు తీసుకెళ్లాలని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సూర్యానాయక్​ తెలిపారు.

Last Updated : Jul 8, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.