ETV Bharat / jagte-raho

ప్రముఖ గాయని పేరిట చాటింగ్ చేస్తూ... రూ.1.75 కోట్లు స్వాహా

author img

By

Published : Aug 12, 2020, 5:05 PM IST

ప్రముఖ గాయని సునీత పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడి మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏకంగా రూ.1.75 కోట్లు టోకరా వేశాడు. బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్​ చేసిన రెండ్రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.

singer cheater
singer cheater

ప్రముఖ గాయని పేరుతో మోసాలకు పాల్పడుతున్న అనంతపురానికి చెందిన చైతన్య మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతున్నారు. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన ఓ మహిళ నుంచి విడతలవారీగా రూ.1.70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం బాధితురాలికి చైతన్య అనే యువకుడు పరిచయమయ్యాడు. ప్రముఖ గాయని చరవాణి నంబర్‌ను చైతన్య... సదరు మహిళకు ఇచ్చాడు. మహిళ వాట్సాప్‌లో గాయనితో చాటింగ్ చేయడంతో... గాయని ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు.

తర్వాత గాయనికి సంబంధించిన వేరే నంబర్ అంటూ చైతన్య మరోటి ఇచ్చాడు. తనే గాయని పేరుమీద చాటింగ్ చేస్తూ మహిళను నమ్మించాడు. ఎప్పుడు వీడియో కాల్ చేసినా మాట్లాడే వాడు కాదు. కేరళలోని ఆనంద చెర్లాయం ట్రస్ట్‌లో రూ.50వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పడంతో మహిళ తీసుకుంది. అమెరికాలో ఉన్న భూములు అమ్మకానికి పెట్టానని.... దానికోసం కావాల్సిన డబ్బులు సర్దుబాటు చేయాలని గాయని పేరుతో చైతన్య... ఆ మహిళను కోరాడు. అలా విడతల వారీగా రూ.1.70 కోట్లు మహిళ చెల్లించింది.

మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే గాయని సునీత... చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చైతన్యను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అనంతపురంలో అరెస్ట్ చేసి... రెండ్రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. చైతన్య బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించారు. రూ.1.75 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ నుంచి రూ.1.60 కోట్లు వసూలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. రేపు న్యాయస్థానంలో చైతన్యను పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతపురంలోనూ చైతన్యపై పలు కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.