నిర్మల్లోని నందిగుండం దుర్గామాత ఆలయ సమీపంలో ఎల్ఐసీ ఏజెంట్ రాజారెడ్డి (50) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మల్లోని దివ్యనగర్లో ఉంటున్న రాజారెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి కారులో బయటకు వెళ్లారు.
శనివారం ఉదయం దుర్గామాత ఆలయం వైపు వెళ్లిన భక్తులకు కారులో రాజిరెడ్డి పడిపోయి ఉండడం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.