నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన శాగం ఈశ్వరమ్మకు చలకుర్తి చివారులో 8.20 ఎకరాల భూమి ఉంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన అనుముల సైదులు ఫోన్ చేసి... ఈశ్వరమ్మకు చెందిన భూమిపై సెక్రటేరియట్లో పలు ఫిర్యాదులు వచ్చాయని... ఆ భూమిని మంత్రి కేటీఆర్ పేదలకు పంచి ఇచ్చేలా ఆదేశించారని మాయమాటలు చెప్పాడు. దానిని ప్రభుత్వపరం కాకుండా చూడాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. ఆ భూమి విషయమై రోజుకు పలుమార్లు ఫోన్ చేసేవాడు. ఉన్నతాధికారుతో మాట్లాడిస్తానని చెప్పి చలకుర్తికి చెందిన గౌతమ్ రెడ్డితో ఫోన్ కాన్ఫరెన్స్పెట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడు.
ఈ వ్యవహారమై బాధితురాలు హైదరాబాద్లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లి చెప్పింది. ఫోన్ నంబర్ల ఆధారంగా ఆమె కుమారుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇస్తామని చెప్పి రమ్మని.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?