ETV Bharat / jagte-raho

భారీస్థాయిలో నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం

author img

By

Published : Dec 14, 2020, 10:49 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా మట్టెవాడ పీఎస్​ పరిధిలో పెద్దమొత్తంలో నిషేధిత గుట్కా పాకెట్లను కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.4.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కారును సీజ్​ చేశారు.

Large quantities of banned gutka pockets seized by taskforce police  in warangal urban district
భారీస్థాయిలో నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం

వరంగల్​ అర్బన్​ జిల్లాలో నిషేధిత అంబర్ గుట్కా పాకెట్లు భారీ మొత్తంలో కార్యదళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్టెవాడ పీఎస్​ పరిధిలో ఓ కారులో తరలిస్తున్న 9 బ్యాగులను గుర్తించారు. వాటి విలువు దాదాపు రూ.4.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మట్టెవాడ మర్రివెంకటయ్య కాలనీకి చెందిన శ్రీధర్ తన కారులో బీదర్​ నుంచి అంబర్​ గుట్కా పాకెట్లను ఇక్కడికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సీఐ నందిరామ్​ నాయక్​ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కారును సీజ్​ చేశారు. తదుపరి చర్యల కోసం గుట్కా పాకెట్లను ఫుడ్​ సేఫ్టీ అధికారులకు అప్పగించామని తెలిపారు.

ఇదీ చూడండి:కామారెడ్డి బావామరదళ్ల కథ విషాదాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.