ETV Bharat / jagte-raho

హాస్టళ్లలో ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు చోరీ - Theft of laptops at KPHB

ఓ వ్యక్తి ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్​లోని ఓ హాస్టల్​కు వచ్చాడు. ఉద్యోగం రాలేదని ఆవేదన చెందిన అతను ఈజీ మనీ కోసం అలవాడు పడ్డాడు. అదును చూసి హాస్టళ్లలో ఉన్న ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లను దొంగిలించడం ప్రారంభించాడు. కానీ చివరకు దొరికిపోయాడు. ఈ ఘటన కేపీహెచ్​బీలో జరిగింది.

Laptops and cell phones stolen in hostels at ameerpet
హాస్టళ్లలో ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు చోరీ
author img

By

Published : Jan 7, 2021, 6:27 PM IST

హాస్టళ్లలో ల్యాప్‌టాప్ చోరీలకు పాల్పడుతున్న దొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా శృంగవరంకు చెందిన మంచిశెట్టి నాగ సత్యనారాయణ.. యం.ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి అమీర్​పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ల్యాప్‌టాప్లు, సెల్​ఫోన్ల చోరీల మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చానని చెప్పి హాస్టల్లో గది తీసుకుని రూమ్​లలో ఉన్న ల్యాప్‌టాప్లు, సెల్ ఫోన్లు అపహరించేవాడు.

కేపీహెచ్​బీలో ల్యాప్‌టాప్ బ్యాగు ధరించి అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి మూడున్నర లక్షల విలువైన ఆరు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్​బీలోని మూడు హాస్టళ్లలో నిందితుడు చోరీ చేసినట్లు ఏసీపీ సురేందర్ రావు తెలిపారు.

ఇదీ చూడండి : టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి షోకాజ్​ నోటీసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.