మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదయ్య... వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి వచ్చి ఇంట్లో ఉన్న దుకాణం గది తలుపులు తీసేందుకు యత్నించాడు. విద్యుత్ తీగ తగిలి ఉండడం వల్ల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. యాదయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కరోనా వ్యాప్తికి ముందు హైదరాబాద్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించిన యాదయ్య... లాక్డౌన్ సమయంలో సొంత గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య ఇంటి వద్ద కుట్టు మిషన్ పని చేస్తోంది. కూలీ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత కుట్టు మిషన్ పని చేసేందుకు ప్రయత్నించిన యాదయ్య ప్రమాదంలో మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదం అలుముకుంది.