ETV Bharat / jagte-raho

కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్టు

హయత్​నగర్​లో యువతిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్​ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి ప్రభుత్వ అధికారిగా చెప్పుకొంటూ మోసాలు చేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్టు...
author img

By

Published : Aug 3, 2019, 6:18 PM IST

Updated : Aug 3, 2019, 8:11 PM IST

కిడ్నాపర్​ రవిశేఖర్​ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశేఖర్... రవి అలియాస్ శ్రీధర్ రెడ్డి అలియాస్ రవీందర్ బాబు అలియాస్ అశోక్ బాబు అనే పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

చక్కెర పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానని 2001లో మొదటిసారిగా బంధువు నుంచి 30వేలు తీసుకొని జైలు శిక్ష అనుభవించాడు. ఎక్కువగా ప్రభుత్వ అధికారిగా చెప్పుకొంటూ డబ్బు కోసం మోసాలకు పాల్పడినట్లు సీపీ వెల్లడించారు. రేషన్ డీలర్స్, బియ్యం మిల్లుల యజమానులు, ఎరువుల దుకాణాలు, కిరణా దుకాణాలకు వెళ్లి విజిలెన్స్ అధికారినంటూ రవిశేఖర్ మోసాలు చేశాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని గత నెల 23న హయత్​నగర్​కు చెందిన యువతిని కిడ్నాప్​ చేసిన రవిశేఖర్...​ చౌటుప్పల్​ టోల్​గేట్ వద్ద పట్టుబడినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడి నుంచి కారు, 47వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, 4 చరవాణీలు, 8 సిమ్ కార్డులు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై ఇప్పటికే 55 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు.

కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్టు...

ఇదీ చూడండి: పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

Intro:Body:Conclusion:
Last Updated : Aug 3, 2019, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.