హైదరాబాద్ నగర శివారు మైలార్‌దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి షమా కాలనీలో ఏడేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై ఎక్కించుకొని అపహరించుకుపోయాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బాలుడు అరవడంతో మరో ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యాడు.
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవునిపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి.. పదిరెట్లు ఇస్తామని చెప్పారు.. రూ. 24 లక్షలు దండుకున్నారు!