గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న వారిని పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. జగిత్యాల ధరూర్ క్యాంపులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా పేకాటను కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పేకాట శిబిరంపై జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేశారు.
ఈ దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోగా... పేకాటకు సహకరిస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.36 వేల నగదు, ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు.