ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్‌పై మరోసారి విచారణ కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాంతీయ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త డీసీహెచ్ డాక్టర్ లక్ష్మణ్ రావు నేతృత్వంలో సుధాకర్‌ను విచారణించారు. సుధాకర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి శాఖాపరమైన విచారణ నిర్వహించామని.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విచారణాధికారి డాక్టర్ లక్ష్మణ్ రావు తెలిపారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్... గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు అధికారులు భావించారు. దీంతో సుధాకర్‌ను సస్పెండ్ చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: భవనంపై పుర్రె.. ఎక్కడిది.. ఎవరిదై ఉంటుంది?