ETV Bharat / jagte-raho

ఇంట్లో మందలించారని ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య! - రైలు కింద పడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఇంట్లో నుంచి అలిగి వెళ్లిన బాలుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

inter student suicide in aleru in yadadri bhuvanagiri district
ఇంట్లో మందలించారని ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య..!
author img

By

Published : Jan 13, 2021, 5:24 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి బయటికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి రుషిచంద్ (17) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం వెతుకుతుండగా రెండు రోజుల తర్వాత పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాత్రి ఇంట్లో వాళ్లపై అలిగి బయటకు వచ్చిన విద్యార్థి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం వెతికారు. రెండు రోజుల క్రితం ఆలేరు-పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు భువనగిరి రైల్వే పోలీస్ ఇన్​ఛార్జ్​ కోటేశ్వరరావు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఇద్దరు దొంగల అరెస్టు... అందులో ఒకరిపై 64 కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.