ETV Bharat / jagte-raho

జోరుగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు! - ఇసుక అక్రమ రవాణా

ఇటీవల కురిసిన వర్షాలకు పాలేరు వాగులోకి భారీగా వరద నీటితో పాటు.. ఇసుక కూడా కొట్టుకొచ్చింది. ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణాకు దిగారు. పట్టపగలే యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

Illegal Sand Bussiness In nalgonda District Madgulapally
జోరుగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు!
author img

By

Published : Aug 29, 2020, 2:56 PM IST

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని బొమ్మకల్​, కల్వెలపాలెం గ్రామాల పరిధిలో గల పాలేరు వాగులో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా ఇసుక తెన్నులు కొట్టుకొచ్చాయి. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు పట్టపగలే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

వేములపల్లి మండలం మంగాపురం, మొల్కలపట్నం గ్రామాల నుంచి మాజీ ప్రజా ప్రతినిధులే నేరుగా ఇసుక తరలిస్తున్నారు. వాగులో ఇసుక తరలించడానికి అనుమతి ఉందా అని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తున్నారు. ట్రాక్టర్​లోని ఇసుకను అన్​లోడ్​ చేసి పరారవుతున్నారు. ఈ విషయంపై పోలీసులు, అధికారులు దృష్టి సారించి అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.