బిల్లులు లేకుండా ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు యూరియా అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. కారేపల్లి సహకార సంఘం నుంచి 60 యూరియా బస్తాలతో ఇల్లందు మండలం పోలరం వెళ్తున్న వాహనాన్ని ఇల్లందు పోలీసులు పట్టుకున్నారు. సాధారణంగా సొసైటీ ద్వారా రైతులకు రెండు, మూడు బస్తాలు మాత్రమే ఇస్తారు. కానీ పెద్ద మొత్తంలో తరలించడం విషేశం.
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నారని ఆరా తీస్త... బిల్లులు హమాలీల వద్ద ఉన్నాయని చెప్పడం గమనార్హం. దీనిపై మండల వ్యవసాయ అధికారులు వివరణ కోరగా... రైతుల పేరిట ఎక్కడి నుంచైనా తీసుకువెళ్ళవచ్చు... కానీ బిల్లులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఏక మొత్తంలో యూరియా ఏ ఒక్కరికీ విక్రయించకూడదన్నారు. యధేచ్చగా సాగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు ,వ్యవసాయ అధికారులు విచారిస్తున్నారు.