ETV Bharat / jagte-raho

ప్రేమ వివాహం.. మనస్పర్థలు.. భర్త ఆత్మహత్య - సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో వ్యక్తి ఆత్మహత్య

మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆరునెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. భార్యతో సంతోషంగా ఉంటూ జీవితం గడపాల్సిన ఆ వ్యక్తి.. మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా పానగల్‌ మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

husband suicide in sangareddy district patancheru
ప్రేమ వివాహం.. మనస్పర్థలు.. భర్త ఆత్మహత్య
author img

By

Published : Oct 23, 2020, 7:37 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవితం గడపాల్సిన ఆ వ్యక్తి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా పానగల్‌ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు.. బార్లో క్యాషియర్‌గా పనిచేసేవాడు. సంగారెడ్డికి చెందిన సుప్రియని ప్రేమించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పటాన్‌చెరులోని గౌతం నగర్‌లో నివాసం ఉంటూ భార్యాభర్తలు జీవనం సాగించేవారు.

వారం రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో భార్యతో కలిసి రామాంజనేయులు.. అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి వచ్చిన అతను వీడియో కాల్‌ ద్వారా సుప్రియతో వాగ్వాదానికి దిగి ఇంటికి రమ్మన్నాడు. ఆమె రాననడంతో వీడియో కాల్‌ ఆన్‌లో ఉండగానే వంటగదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కదం తొక్కిన కర్షకులు ... కామారెడ్డిలో రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.