ఏపీలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గెడ్డకిందపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది.
గెడ్డకిందపల్లి గ్రామంలోని వెంకటేశ్ రెడ్డి, శిరీషలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. కొంతకాలం నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు ఎక్కువవడం వల్ల ఊరు దగ్గరలోని మామిడితోటలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముందుగా వెంకటేశ్ కత్తితో భార్య గొంతు కోసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్య శిరీష మృతి చెందగా.. భర్త వెంకటేశ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు... ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చదవండి : ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు