విద్యార్థినుల ఫేస్‌బుక్ ఖాతాల్లోకి ప్రవేశించి వేధింపులు... బెదిరింపులు... హెచ్చరికలు చేస్తున్నారు. వీటితో పాటు ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్‌లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను వీడియోలను నేరస్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి వారిని బెదిరించడం మొదలు పెడుతున్నారు. డబ్బుకావాలని, లైంగిక కోర్కెలు తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
సంభాషణలు జోడించి..
యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలు వారి చిత్రాలను క్షణాల్లో అంతర్జాలంలో అప్‌లోడ్ చేస్తున్నారు. తొలుత సాధారణ ఫొటోలు, వీడియోలను ఉంచుతున్న నిందితులు బాధితులకు ఫోన్ చేసి అసభ్యకరమైన అప్‌లోడ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో ఇళ్లలో ఉంటున్న విద్యార్థినులు స్నేహితులతో జూమ్, గూగుల్‌మీట్‌ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. వీరిలో కొందరు మాట్లాడుకుంటున్న దృశ్యాలను స్క్రీన్‌షాట్ల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉంచుతున్నారు. వీటిని సేకరిస్తున్న పోకిరీలు వారు మాట్లాడినట్టే అసభ్య సంభాషణలను జోడించి తిరిగివారికే పంపుతున్నారు. అంతర్జాలంలో ఉంచకూడదంటే తాము చెప్పినట్టు చేయాలంటూ బెదిరిస్తున్నారు.
‘‘సర్, నాకు వారంరోజు నుంచి అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతుంటే ఒకసారి హెచ్చరించాను. మళ్లీ, మళ్లీ ఫోన్ చేస్తుంటే.. భరించలేక ఫోన్ నంబరు బ్లాక్ చేశాను.. రెండురోజులయ్యాక మరో నంబర్‌తో అతడే ఫోన్ చేశాడు. అప్పటి నుంచి నంబర్లు మారుస్తూ అర్ధరాత్రి వేళల్లోనూ ఫోన్‌చేసి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. రెండు రోజుల తర్వాత నా వాట్సాప్ నంబరుకు అశ్లీలమైన వీడియోలు పంపించాడు.. తర్వాత నా ఫోటోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించాడు. నా ఫేస్‌బుక్ ఖాతాకు నగ్నవీడియోలు పంపించాడు. వీటిని నా స్నేహితులు చూశారు. ఏంటిలా? అంటూ మాట్లాడారు.. వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఓ స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయమంటే వచ్చాను.
అతడిని గుర్తించి కఠినంగా శిక్షించండి..’
సైబర్ వేధింపులు ఎదుర్కొంటున్న విద్యార్థినులు, యువతుల ఫిర్యాదుల్లో 70శాతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లవే ఉంటున్నాయి. కేసు నమోదు చేస్తామంటే.. సున్నిత మనస్కులైన యువతులు కేసు వద్దని, నిందితులను పట్టుకుంటే చాలంటూ అభ్యర్థిస్తున్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. 94906 16555కు వాట్సాప్ చేయండి. 040-27852412తో మాట్లాడండి. కేవీఎం ప్రసాద్, ఏసీపీ సైబర్ క్రైమ్స్
ఇదీ చదవండి- సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైల్ సర్వీసులు!