ETV Bharat / jagte-raho

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కులం తక్కువని వద్దన్నాడు..!

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని యువకుడు మోసం చేసిన ఘటన హైదరాబాద్​లో ఎల్బీనగర్​లో చోటుచేసుకుంది. కులం తక్కువని ఆ యువతిని పెళ్లి చేసుకోనన్నాడు. అవమానానికి గురైనట్లు భావించిన యువతి ఆత్మాహత్యాయత్నం చేసింది. న్యాయం చేయాలని అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లి చేసుకుంటానని ప్రేమించాడు.. కులం తక్కువని వద్దన్నాడు..

author img

By

Published : Jan 26, 2021, 7:58 AM IST

పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించి కులం తక్కువని యువతిని యువకుడు మోసం చేసిన ఘటన హైదరాబాద్​లోని ఎల్బీ నగర్‌లో జరిగింది. ఎల్బీనగర్​లోని మన్సూరాబాద్​కు చెందిన ఓ యువతి, అనురుధ్ పాండే అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి ఆ యువతిని అనురుధ్ మోసం చేశాడు. దీంతో అవమానానికి గురైనట్లు భావించిన రమాదేవి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. 4 రోజుల కింద యాసిడ్ తాగిన రమాదేవిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

రమాదేవి తండ్రి కిష్టయ్య ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌‌లో అనురుధ్‌పై ఫిర్యాదు చేశాడు. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయకుండా నామమాత్రంగా కేసు పెట్టి వదిలేశారని రమాదేవి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ పీఎస్ ముందు యువతి కుటుంబీకులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని రమాదేవి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: గోల్నాకలో.. దంపతుల బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.