భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బిల్లుడుతండాలో గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, జడ్పీటీసీ సురేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.8 వేలు, 10 కేజీల బియ్యాన్ని అందించి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తామని తెలిపారు.

చూడండి: గ్రేటర్ పోరు: మేయర్ పీఠం దక్కేదెవరికి ... క్షణక్షణం అప్ మీకోసం