యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పట్టణానికి చెందిన కల్యాణ్రావుగా పోలీసులు గుర్తించారు. కల్యాణ్‌రావు ఆత్మకూరు(ఎం) పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.
అసలు జరిగిందంటే?
ఉద్యోగానికి శిక్షణ కోసం ఊరు కాని ఊరు వచ్చిన యువతి లక్ష్య సాధన కోసం కృషి చేసింది. ఆదే ధ్యేయంతో చదువుతున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. శిక్షణకు సంబంధించిన సందేహాలు, సలహాలు ఇచ్చిపుచుకునే సందర్భంలో ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు ఏకమవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఓ యువకుని ప్రవేశం.. కల్లోల్లాన్ని రేపింది. చివరకు ఇద్దరి మరణానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష.. 2011లో హైదరాబాద్‌కు వచ్చింది. గ్రూప్2లో ఉద్యోగం కోసం శిక్షణా సంస్థలో చేరింది. అదే శిక్షణా సంస్థలో భువనగిరికి చెందిన కల్యాణ్ రావు చేరాడు. ఇద్దరి మధ్య కలిగిన పరిచయం ప్రేమగా మారడంతో... 2012లో పెళ్లి చేసుకున్నారు. కల్యాణ్ రావు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరులో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఆద్య అనే 6 ఏళ్ల కూతురు ఉంది. పాప చదువు కోసం కల్యాణ్ రావు ఘాట్కేసర్ పీఎస్ పరిధిలోని ఐకె గూడలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఇక్కడి నుంచే ఆత్మకూరుకు విధులకు వెళ్లి వచ్చేవాడు.
వివాహేతర సంబంధంతో...
రెండేళ్ల క్రితం అనూషకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వాణిజ్య సంస్థలో పనిచేస్తున్న కరుణాకర్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కరుణాకర్ తన స్నేహితుడు రాజశేఖర్‌ను అనూషకు పరిచయం చేశాడు. ఆ తర్వాత అనూష కరుణాకర్‌ను వదిలిపెట్టి రాజశేఖర్‌తో పరిచయం పెంచుకుంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అనూష దూరం పెట్టడం వల్ల అనుమానం పెంచుకున్న కరుణాకర్ ఆమెపై నిఘా పెట్టాడు.
రాజశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు నిర్ధరించుకుని అతని హతమార్చేందుకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 2న అనూష ఇంటికి కత్తి తీసుకొని వెళ్ళాడు. పడక గదిలో రాజశేఖర్, అనూష ఉన్నట్లు గుర్తించి బయటికి రావాలని కేకలు వేశాడు. ఇద్దరూ బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న అనూష కూతురు ఆద్యను చంపేస్తానని బెదిరించాడు.
ఉన్మాదిలా మారి...
అయినప్పటికీ తలుపులు తీయకపోవడంతో ఉన్మాదిలా మారిన కరుణాకర్.. చిన్నారి ఆద్య గొంతుకోశాడు. ఆద్య కేకలు వేయడంతో తలుపు తీసి బయటకు వచ్చిన అనూష సొమ్మసిల్లి పడిపోయింది. గదిలోనుంచి పారిపోతున్న రాజశేఖర్ పైన కరుణాకర్ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. రాజశేఖర్ తప్పించుకు పోవడంతో అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని, అనూషను ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయాలపాలైన నిందితుడు కరుణాకర్‌ను ఘట్కేసర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న అనంతరం ఈ నెల 7న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మనస్తాపం చెంది ఆత్మహత్య
పాపా చనిపోయినప్పటి నుంచి భార్య, భర్త కల్యాణ్‌రావు ఇద్దరు భువనగిరిలోనే ఉంటున్నారు. శనివారం కల్యాణ్ తన భార్య, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లారు. భార్య అనూషను అక్కడి దింపి... డ్రైవర్‌తో పాటు తిరుగుప్రయాణమయ్యాడు. తాను ఆఫీసుకు వెళ్తున్నట్లు.. ఇంటి వద్ద కారు పార్క్ చేయమని డ్రైవర్‌కు చెప్పి.. పట్టణంలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనతో అనూష ఒంటరి అయిపోయింది. క్షణికానందం కోసం అడ్డదారిలో వెళితే నా అనే వాళ్లే మిగలకుండా పోతారనే దానికో అనూష ఉదంతమే ఒక ఉదాహరణ.
సంబంధిత కథనాలు: