ETV Bharat / jagte-raho

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడు!

author img

By

Published : Sep 3, 2020, 9:54 AM IST

మూడేళ్లుగా ప్రేమించాడు. ఆపై మెుహం చాటేయడంతో యువతి నిలదీసింది. కక్ష పెంచుకున్న యువకుడు.. ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

fire
ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడి కుటుంబ సభ్యులు!

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శ్రీ హరిపురానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని, పక్క గ్రామమైన వడాలికి సాయిరెడ్డి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఎస్సీ సామాజికవర్గానికి చెందడం వల్ల సాయిరెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి సాయిరెడ్డితో పాటు కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మోసం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని అరెస్ట్ చేసి, ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సాయిరెడ్డి కుటుంబం అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో, కొంతమంది కేసు ఉపసంహరించుకోవాలని యువతి కుటుంబంపై ఒత్తిడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఒత్తిళ్లకు లొంగకపోవడంతో ఇటీవల కొంతమంది తమ ఇంటి వద్దకు వచ్చి బెదిరించారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజీకి రాలేదని ఆక్రోశంతోనే గత రాత్రి తన కుటుంబ సభ్యులతో.. ఇంట్లో నిద్రిస్తుండగా, చంపడానికి ఇంటికి నిప్పు పెట్టారని యువతి ఆరోపిస్తోంది. ఇంట్లో దట్టంగా పొగ అలుముకోవడంతో కంగారుగా బయటకు వచ్చామని.. ప్రమాదం నుంచి బయటపడ్డామని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై వివరాలు చెప్పటానికి పోలీసులు నిరాకరించారు.

ఇదీ చదవండి: పలు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.