ETV Bharat / jagte-raho

టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం - మేడ్చల్ మల్కాజ్​గిరి తాజా వార్తలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గోకుల్​ నగర్​లోని ఓ టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. రూ.10లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

fire-accident-at-gokul-nagar-in-medchal-malkajgiri-district
టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం...
author img

By

Published : Dec 23, 2020, 7:16 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాచారం మల్లాపూర్​లోని గోకుల్ నగర్​లోని ఓ టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 పాయింట్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన సంభవించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. టైర్ల కంపెనీకి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేనందునే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. కంపెనీకి అనుమతులు లేనట్టు తెలుస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: కాల్​మనీ కేటుగాళ్లు.. తీస్తున్నారు ప్రాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.